Friday, 12 October 2018

c/o kanchera palem SHORT MOVIE

Aasha Pasham Song Lyrics

Aasha pasham bandhi chesele
Saage kaalam aade aatele
Theera theeram chere loga
Ne yetheeravno
Cheruvaina chedu doorale
Thodauthoone eede vainaale
Needho kadho theleloga
Ne edhetavno
Aatu potu gunde maatullona
Saagena

Ee elelelo
Kallolam ee lokamlo
Lo lo lolothullo
Ye leelo yedha kollanullo

Nindu punnamela
Mabbu kammukochi
Simma seekati allipothunte
Nee gamyam gandhara golam
Dikku thochakunda talladillipothu
Palltillipoyi neevunte
Theerena nee aaratam
Ye hethuvu nuduti rathalni marchindo
Nisithanga thelisedhela
Repetavno thelaalante
Nee uniki undaligaa

Oo aatu potu
Gunde maatullonaa
Saagena

Aasha pasham bandhi chesele
Saage kaalam aade aatele
Theera theeram chere loga
Ne yetheeravno

Ye jaadalo yem unnadho
Kreeneedala vidhi vechunnadho
Ye malupulo yem dagunnadho
Neevu ga thelchuko
Nee saili lo

Siggu mullu gappi
Rangu leenuthunna
Lokamante pedda natakame
Theliyakane saage kathanam
Neevu pettukunna nammakalu anni
Pakka dhaari patti pothunte
Kanchi ki nee kathale dhooram
Nee chethullo undi sethallo soopinchi
Yeduregi saagaaliga
Repetavno thelalante
Nuvvedhuru soodali ga
Ooo aatu potu
Gunde maatullona untunna

Sunday, 23 September 2018

ధనవంతుడు

ఒకడు అమ్ముకొని దనవంతుడవుతాడు.
ఇంకోడు కొనుక్కొని దనవంతుడౌతాడు.

ఒక ధనవంతుడు బీదవాడిగా ఆలోచిస్తూ చివరికి బీదవాడిగా అయిపోతాడు.

ఒక బీదవాడు దనవంతుడిగా ఆలోచిస్తూ చివరికి
దనవంతుడిగా అయిపోతాడు.

ఒకడు పని కావాలని వచ్చాడు.
పనిలో పెట్టితే రక రకాలుగా ఎదిగి చివరికి  వాడే బెస్ట్ అని గొప్పలు పోయాడు.

నదిమంతరపు సిరి

పాత్ర-పాత్రత

ఆ పాత్ర - ఈ పాత్ర

నువ్ చేయాలనుకునే పాత్రకు న్యాయం చేయనివ్వరు. వదిలేసిన పాత్రలో నటింప చేస్తారు. వారి నటనలో నిజముందని భ్రమింప చేస్తారు. నువ్ నమ్ముకున్న పాత్ర వేరు. వారికి నచ్చిన పాత్ర వేరు.

Saturday, 15 September 2018

పిల్లలకు క్రమశిక్షణ నేర్పే విధానం

హెచ్చరిక: అతి క్రమశిక్షణ రక్త సంబంధాలను దూరం చేస్తుంది. 

పిల్లలకు క్రమశిక్షణ నేర్పే విధానం ఏది..??

గమనిక: 
           ఏ ఇంట్లో యజమాని తన పరిధి లో ఉండి, ఆడవారి వంట పనుల్లో - పిల్లల వస్తువుల విషయాల్లో, మిగితా రూముల్లొ అందరి వ్యక్తిగత అలవాట్లలో తల దూర్చకుండా -- కాలు మీద కాలు వేసుకొని --త్యాగమూర్తులు గా ఉంటే ..... అక్కడ...అలాంటి కుంటుంబలలో పిల్లలు తార తరాలుగా ఎదుగుతారు, ఐకమత్యముగా వుంటారు.
 

మీరు క్రమశిక్షణతో ఉన్నారని అంటే మీరు నేర్చుకోవటానికి సంసిద్ధంగా ఉన్నారనే. మీరు ఎక్కడో ఆగిపోయి లేరు. క్రమశిక్షణ దేన్నైనా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేయటం మాత్రమే కాదు, మీరు నిరంతరం అన్నీ ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో నేర్చుకోవాలని సుముఖంగా ఉండడమే.

ఏదైనా బలవంతాన నేర్చుకోనేలా చేయలేరు కాని మీరు ఎవరినైనా ఏదైనా పని చేయమని బలవంతపెట్టగలరు. కాని మీరు ఒక సారి వారిని బలవంతపెట్టటం మొదలు పెడితే అది తక్కువ కాలం వరకు అయితే పర్వాలేదు కాని అదే దీర్ఘకాలం వరకూ సాగాలంటే మీ ప్రాణం పోతుంది, వాళ్ళ ప్రాణం కూడా పోతుంది. దాన్నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ ప్రాణం పోతుంది.
నా చిన్నతనంలో నా కుటుంబం నాతో ఏది బలవంతాన చేయించాలని చూసినా అది ఎప్పుడూ పని చేసేది కాదు. కాని ఏదైతే ఒక కుటుంబ సంప్రదాయంగా అలవాటు చేసారో అది మాత్రం పనిచేసేది, అది నాకు ఎంతో గొప్ప విధానంగా ప్రయోజనాన్ని చేకూర్చింది. అవి అన్నీ సాధారణమైన విషయాలే. ఉదాహరణకు, మేము ఎక్కడ ఉన్నా కూడా మధ్యానం, రాత్రి భోజనానికి ఎప్పుడూ ఇంటికి వెళ్ళే వాళ్ళము. అది ఉదయాన్నే టిఫిన్ చేసేటప్పుడు వీలయ్యేది కాదు ఎందుకంటే కుటుంబసభ్యులు వేరే వేరే సమయాల్లో బయల్దేరి వెళ్ళేవాళ్ళు. కాని లంచ్ మరియు డిన్నర్ మాత్రం కుటుంబం మొత్తం కలిసి చేసేవాళ్ళము. ఒక్క వ్యక్తి రాకపోయినా మొత్తం కుటుంబం ఎదురు చూస్తూ ఉండేది. కనుక ఆ సమయానికి వెళ్ళకుండా ఉండలేక పోయేవాళ్లము. ఇది బలవంతాన జరగలేదు. మీరు అందులో భాగంగా మారేలాంటి ఒక వాతావరణం సృష్టించబడింది.
ఏది చేయాలో అది ఒక ప్రత్యేకమైన విధానంలో చేయటమే ముఖ్యమైనది. మీ జీవిత నాణ్యత ఒక నిర్దిష్ట స్తాయిలో ఉండాలంటే మీకు శుభ్రమైన వాతావరణం కావలి. మీరు ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలంటే కొన్ని పనులు చేయాలి. మీరు కిందకి వంగి ఇది చేయటం ఇష్టపడకపోతే అప్పుడు మీరు శుభ్రంగా లేని చోటే ఉంటారు. కనుక ముందు మీ ప్రాధాన్యతలు సరిగ్గా ఉంచుకోండి. ఒక పని ఎందుకు చేయాలనేది మీరు వారికి అర్ధం అయ్యేలా చేస్తే వివేకం ఉన్న ప్రతీ మనిషి అలా చేయటానికి సుముఖంగానే ఉంటారు. మీరు తెలివైన వారైతే అయితే ఏది ఉత్తమమైనదో అర్ధం చేసుకుని, మీరు అదే చేస్తారు. మీకు ఏదీ అర్ధం కాకపోతే మీరు ఒక గాడిదలాంటి వారే. గాడిదను గాడిదలాగానే చూస్తారు మరి. ఇతరులు మిమల్ని ఒక గాడిదలాగా చూడకపోయినా మీరు ఒక గాడిదలాగానే బ్రతుకుతారు.

నాగరికత పాఠ్యపుస్తకాలు, ప్రబోధకుల ద్వారా విస్తరించటం లేదు. అది ప్రధానంగా మీ కుటుంబ జీవన విధానమే.

మా ఇంట్లో పని మనిషి వచ్చిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా మా అమ్మ రెండు సార్లు ఇల్లు ఊడ్చేవాళ్ళు, ఒకసారి ఉదయాన్నే, మరొకసారి సాయంత్రానికి. ఒకసారి ఇల్లు తుడిచేవాళ్ళు. ఇల్లు ఊడ్చి తుడిచే వరకు ఆమె స్నానం, భోజనం చేసే వారు కాదు. మీ అమ్మే మొత్తం పని చేస్తుంటే మీరెలా చూస్తూ ఊరుకుంటారు? అందరూ ఎవరు చేయగలిగింది వాళ్ళు చేసేవారు. అది కేవలం పని మనిషి మాత్రమే చేస్తుంటే, ఆమె రానప్పుడు మా అమ్మ చేయకపోతే అది మేము చేయాలని ఎప్పుడూ అనుకునే వాళ్ళము కాదు, ఎందుకంటే అది పని మనిషి చేయాల్సిన పని అని అనుకునేవాళ్ళం. కాని ఆమె ఎప్పుడు రాకపోయినా మా అమ్మ మొహమాటం లేకుండా ఆ పని చేసే వారు కనుక ఆ పని చేయకపోవటం అనే ప్రశ్నే లేదు. అందుకే అందరూ చేసేవాళ్ళు.
ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఎంతో ఎక్కువ తేడాను తెస్తాయి. మీరు ఉదయాన నిద్ర లేచినప్పుడు మీ పరుపును ఎలా వదిలేస్తారు అన్నదగ్గర నుంచి మీ కాఫీ కప్పు ఎక్కడ పెడతారు అనేలాంటివి – ఇలాంటి విషయాలలో చాలా కుటుంబాలలో దురదృష్టవశాత్తూ సరైన అలవాట్లు లేవు. మేము అవి చేయకపోతే మా మీద ఎవరూ కేకలు వేసేవారు కాదు. మా అమ్మే కూర్చుని అవన్నీ చేసేవారు. ఆమె చేయటం చూడగానే మేము కూడా ఒక చేయి వేసి ఆ పని మేమే చేసేవల్లము.
నాగరికత పాఠ్యపుస్తకాలు, ప్రబోధకుల ద్వారా విస్తరించటం లేదు. అది ప్రధానంగా మీ కుటుంబ జీవన విధానమే. అన్నీ కూడా, మీ బాత్ రూమ్ నుంచి డైనింగ్ టేబుల్ వరకూ, మీరు వాటిని ఎలా సర్దుకుంటారు అనేవన్నీ కూడా నిర్ణయించబడి ఉన్నాయి, మరి వాటిని అలాగే చేసేవారు. మీరు దాంట్లో పాల్గొంటున్నారా లేదా అని ఎవరూ అడిగే వాళ్ళు కాదు కాని అలా వదిలేసి మీరు ఎంత కాలం ఉంటారు? మీరు అలా ఉండలేరు కదా. అందరూ చేస్తుంటే మీరు కూడా దానిలో పాల్గొంటారు, ఆ పని చేస్తారు.

మీ పిల్లల జీవితంలో యోగ సాధనను చేరిస్తే వాళ్ళు క్రమశిక్షణగా ఉండకుండా ఉండే దారే లేదు. యోగ సాధన చేయటం మీ జీవితంలో క్రమశిక్షణను తెస్తుంది ఎందుకంటే మీరు కొన్ని పనులను ఒక ప్రత్యేకమైన విధానంలో చేస్తారు. అలా చేయకపొతే అవి పని చేయవు. యోగాను ఎంత క్షుణ్ణంగా నేర్పిస్తారంటే మీరు అంత క్షుణ్ణంగా చేయటం మొదలు పెట్టగానే మీరు క్రమశిక్షణ లేకుండా ఉండే దారే లేదు.

Sunday, 1 April 2018

Ever New Global Union --------- E N G Union.com: Online Radio

Ever New Global Union --------- E N G Union.com: Online Radio: post

Bottu -- explanation

🔯🔯🔯🔯🔯🔯

*బొట్టు పెట్టుకోకపోతే*
*ఏమవుతుందో*
*తెలుసుకోండి*.

🌺మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది.

బొట్టులేని ముఖము,
ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో
వారి యొక్క ముఖము,
ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత
ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,
దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

🌺ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు.

అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.
వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు.

కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

🌺మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు.

నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు, అలాగే ఎదురుగా ఉండేటటువంటివారు
మన ముఖాన్ని చుస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.
మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.

🌺ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.

ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన
ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.
అంటే మెదడుకు సంభందించినటు
వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి.

🌺కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది.
మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది.
తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.
మనఃశాంతి పోతుంది.
చిరాకు వస్తుంది.
ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము.
కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే
మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే మెదడును కాపాడుకోవాలంటే
మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.
అంటే బొట్టు పెడితే చాలు.
మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు
మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.
తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.

🌺జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.
ఎతువంటి ఒత్తిడికి
లోనూ కావు.
మనల్ని కాపాడుతూ ఉంటాయి.
మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.
అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.

🌺సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.

అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.

ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని
బొట్టుగా ధరించండి.
ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ
కూడా తొలగిపోతాయి.

అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.

🌺పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైరవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు.

ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు.

ఆ బొట్టును వైరవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.
ఎటువంటి తప్పూ లేదు.
అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి.

🌺మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన యొక్క ఆచారాలే.
ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే
హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము
దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము.

ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు.
అందుకని చక్కగా కుంకుమను ధరించండి.

*“సర్వేజనా*
  *సుఖినోభవంతు"*🌞